పాపం క్రిస్‌గేల్.. అనుకున్నదొకటి.. అయినదొక్కటి..!

Sat,August 10, 2019 02:28 PM

chris gayle not included in west indies test team against india series

గయానా: తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు.. వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ ఒకటి అనుకుంటే.. మరొకటి జరిగింది. భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు క్రిస్‌గేల్ వీడ్కోలు చెబుదామని అనుకున్నాడు. కానీ సెలెక్టర్లు మాత్రం అతని ఆశను అడియాశను చేశారు.

ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్ అనంతరం రిటైర్ అవుతానని క్రిస్‌గేల్ అంతకు ముందే ప్రకటించాడు. అయితే తర్వాత మనస్సు మార్చుకున్న గేల్ స్వదేశంలో భారత్‌తో జరిగే టెస్టు సిరీస్ ఆడి రిటైర్ అవుతానని ప్రకటించాడు. అయితే త్వరలో భారత్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు మాత్రం విండీస్ సెలెక్టర్లు గేల్‌ను పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు గేల్ వన్డే సిరీస్‌లో మాత్రం ఆడుతున్నాడు. అయితే గేల్‌కు టెస్టు సిరీస్ ద్వారా రిటైర్మెంట్ అయ్యే చాన్స్ లేకపోవడంతో ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్ ద్వారానే రిటైర్ అవుదామని చూస్తున్నాడట. ఇక ఈ విషయంపై గేల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

భారత్‌తో జరగనున్న టెస్ట్ మ్యాచ్‌లకు విండీస్ సెలెక్టర్లు ప్రకటించిన జట్టు సభ్యులు వీరే...

వెస్టిండీస్ టెస్టు టీం: జేసన్ హోల్డర్ (కెప్టెన్), క్రెయిగ్ బ్రాత్‌వైట్, డారెన్ బ్రేవో, షమరాహ్ బ్రూక్స్, జాన్ క్యాంప్‌బెల్, రోస్టన్ చేజ్, రకీం కార్న్‌వాల్, డొవ్రిచ్, గ్యాబ్రియెల్, హిట్‌మైర్, షై హోప్, కీమర్ రోచ్, కీమో పాల్.

2801
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles