గేల్ వచ్చాడు..మిగతా జట్లకు నిద్రలేని రాత్రులే: రాహుల్

Mon,April 16, 2018 05:01 PM

Chris Gayle is back and it is bad news for other teams, says KL Rahul


న్యూఢిల్లీ: గత సీజన్‌లో ఘోరంగా విఫలమవడంతో ఐపీఎల్-11 సీజన్ కోసం జనవరి ఆఖరివారంలో నిర్వహించిన వేలంలో విధ్వంసకర బ్యాట్స్‌మన్ అని పేరు తెచ్చుకున్న క్రిస్‌గేల్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు. చివరికి స్టార్ ఆటగాళ్లు అమ్ముడుపోయిన తరువాత మిగిలిన ఆటగాళ్ల జాబితా నుంచి మరోసారి జరిగిన రౌండ్‌లో పంజాబ్ జట్టు గేల్‌ను దక్కించుకుంది. ఈ ఏడాది సీజన్‌లో పంజాబ్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌లకు అతన్ని జట్టులోకి తీసుకోలేదు. కానీ, ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌కు అతన్ని ఎంపిక చేశారు. వచ్చిన అవకాశాన్ని కరీబియన్ స్టార్ గేల్(63; 33 బంతుల్లో 7×4, 4×6) సద్వినియోగం చేసుకోని జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 197 పరుగులు చేసింది. ఇందులో గేల్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.

ఈ నేపథ్యంలో క్రిస్‌గేల్ తన మునుపటి ఫామ్‌ను కనబర్చడంపై గేల్‌తో ఓపెనింగ్ బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ స్పందించాడు. అతడి మెరుపు బ్యాటింగ్‌తో మిగతా జట్లకు నిద్రలేని రాత్రులేనని అభిప్రాయపడ్డాడు. లీగ్‌లోని ప్రత్యర్థి జట్లకు హెచ్చరిక కూడా చేశాడు. క్రిస్‌గేల్ బంతితో రాణించడంతో మా జట్టుకు ఇదొక అద్భుతమైన వార్త. కానీ మిగతా జట్లకు ఇది చెడ్డవార్తే. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉన్న అతనిలో ఉందన్న విషయం మా అందరికీ తెలుసు. తనదైన రోజున విధ్వంసం సృష్టిస్తాడు. అదే చెన్నైతో మ్యాచ్‌లో చేసి చూపించాడు. అతన్ని జట్టులో కొనసాగించాలని.. ఇదే ఫామ్‌ను తరువాతి మ్యాచ్‌ల్లో పునరావృతం చేయాలని కోరుకుంటున్నాం. అని మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో రాహుల్ పేర్కొన్నాడు.

వేలంలో తొలి రెండు రౌండ్లలో గేల్‌పై ఎవరూ ఆసక్తి చూపలేదు. తరువాత తన కనీసధర రూ.2కోట్లు పెట్టి బాలీవుడ్ నటి ప్రీతి జింతా సహయాజమానిగా ఉన్న పంజాబ్ కనికరించింది. ఇదే తరహాలో యువరాజ్‌సింగ్‌ను కూడా ఫ్రాంఛైజీ దక్కించుకుంది. పంజాబ్ తన తరువాతి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడనుంది. గేల్ ఇదే ఫామ్‌ను మిగతా మ్యాచ్‌ల్లోనూ కొనసాగిస్తాడో చూడాలి.

3867
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS