ఫిట్ నెస్ గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోను..

Thu,May 16, 2019 07:43 PM

Chris Gayle chooses yoga over gym for gain energy


వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ మైదానంలో అడుగుపెట్టాడంటే..ఏ స్తాయిలో విజృంభిస్తాడో చెప్పనవసరం లేదు. ఎపుడూ బౌండరీల వర్షం కురిపించే గేల్ ఈ మధ్య కాస్త నెమ్మదించాడు. ఈ నేపథ్యంలో గేల్ ఫిట్ నెస్ విషయంలో క్రీడాభిమానులకు అనుమానాలు వస్తున్నాయి. తాజాగా దీనిపై స్పష్టత ఇచ్చాడు గేల్. తాను కొన్ని నెలలుగా జిమ్‌కి వెళ్లడం లేదని.. తన అనుభవం, మానసిక దృఢత్వమే తన బలమని అన్నాడు. తాను ఫిట్‌నెస్ గురించి జాగ్రత్తలు తీసుకోనని చెప్పిన గేల్.. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం, యోగాకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే శారీరక సమస్యలు తనను వేధించవని అని గేల్ చెప్పాడు. మే 30వ తేదీ నుంచి ప్రారంభంకానున్న క్రికెట్ వరల్డ్ కప్‌ జట్టులో వెస్టిండీస్ బోర్డు గేల్‌కు వైస్ కెప్టెన్ హోదా కల్పించిన విషయం తెలిసిందే.

2222
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles