పొలార్డ్‌ ఒంటరి పోరాటం.. ముంబై స్కోరు 149

Sun,May 12, 2019 09:23 PM

Chennai Super Kings Restrict Mumbai Indians To 149

హైదరాబాద్‌: ఐపీఎల్‌-12 తుది సమరంలో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మెన్‌ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయారు. మెరుపు ఆరంభం లభించినప్పటికీ ఓపెనర్లు వెనుదిరగడంతో వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకుంది. బ్యాట్స్‌మెన్‌ భాగస్వామ్యాలు నెలకొల్పకుండా చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలర్లు వైవిధ్య బంతులతో కట్టడి చేశారు. ప్రతి బౌలరూ తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో చెన్నై ఫీల్డర్లు కళ్లుచెదిరే క్యాచ్‌లు అందుకోవడంతో స్టార్‌ ప్లేయర్స్‌ పెవిలియన్‌ చేరారు. కీలక సమయంలో పొలార్డ్‌(41నాటౌట్‌: 25 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయడంతో నిర్ణీత ఓవర్లలో ముంబై 8 వికెట్లకు 149 పరుగులు చేసింది.

ఇన్నింగ్స్‌ తొలి నాలుగు ఓవర్లకు 37/0తో ఉన్న ముంబై.. తర్వాతి నాలుగు ఓవర్లకు 16 పరుగులే చేసి రెండు కీలక వికెట్లు నష్టపోయింది. ధోనీ స్ప‌న్న‌ర్ల‌ను రంగంలోకి దించి ముంబై బ్యాట్స్‌మెన్‌ స్వేచ్ఛగా పరుగులు చేయకుండా స్కోరు వేగానికి అడ్డుకట్ట వేశాడు. ఆఖర్లో ఆల్‌రౌండర్లు పొలార్డ్‌, హార్దిక్‌ సిక్సర్లతో చెలరేగడంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు సాధించింది. కొంతసేపు ముంబై జోరు కొనసాగినప్పటికీ చాహర్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరగడంతో పొలార్డ్‌కు సహకరించే వారు కరువయ్యారు. ముంబై బ్యాట్స్‌మెన్లలో క్వింటన్‌ డికాక్‌(29 17 బంతుల్లో 4సిక్సర్లు), రోహిత్‌ శర్మ(15 14 బంతుల్లో సిక్స్‌, ఫోర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌(15), ఇషాన్‌ కిషన్‌(23), కృనాల్‌ పాండ్య(7), హార్దిక్‌ పాండ్య(16), రాహుల్‌ చాహర్‌(0), మెక్లనగన్‌(0), బుమ్రా(0) విఫలమయ్యారు.

871
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles