ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై.. ఓడితే పంజాబ్ ఇంటికే

Sun,May 20, 2018 08:05 PM

Chennai Super Kings opt to bowl

పుణె: ఐపీఎల్-11లో పుణె వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య సీజన్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో చెన్నై పరాజయం పాలైన నేపథ్యంలో తప్పులు పునరావృతం చేయకూడదని ధోనీసేన పట్టదలగా ఉంది. మరోవైపు ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే పంజాబ్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. చెన్నైపై 53 పరుగులకు పైగా తేడాతో గెలుపొందితేనే పంజాబ్ ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే మిగతా జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా పంజాబ్ ఇంటిబాట పట్టనుంది.

2214
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles