డాడీస్ ఆర్మీ vs కిడ్స్ ఆర్మీ.. ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

Fri,May 10, 2019 07:32 PM

Chennai Super Kings have won the toss and have opted to field

విశాఖపట్నం: ఐపీఎల్-12వ సీజన్ క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో సమిష్టి వైఫల్యంతో ఓటమిపాలైన చెన్నై మురళీ విజయ్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను తీసుకుంది. మరోవైపు తమ టీమ్‌లో ఎలాంటి మార్పులు చేయకుండా బరిలో దిగుతున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ సారథి శ్రేయాస్ అయ్యర్ చెప్పాడు.

లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ చెన్నై చేతిలో ఓడటం ఢిల్లీని కాస్త ఇబ్బంది పెడుతున్నా.. ప్రత్యర్థి ఎవరైనా రెచ్చిపోవడమే లక్ష్యంగా బరిలో దిగే ఈ కుర్ర జట్టుకు అదేమంత పెద్ద సమస్య కాకపోవచ్చు. ఓవ‌రాల్‌గా.. ఈ మ్యాచ్‌ను యువ రక్తానికి.. అనుభవానికి మధ్య పోరుగా అభివర్ణించవచ్చు.2020
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles