ఫైనల్‌: టాస్ గెలిచిన చెన్నై.. సన్‌రైజర్స్‌కు షాక్

Sun,May 27, 2018 06:49 PM

Chennai Super Kings have won the toss and have opted to field

ముంబయి: దాదాపు రెండు నెలల పాటు అభిమానులను అలరించిన ఐపీఎల్ టోర్నీ రసవత్తర ముగింపునకు సిద్ధమైంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఫైనల్ పోరు జరుగుతోంది. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సీనియర్ బౌలర్ హర్భజన్‌సింగ్ స్థానంలో కర్ణ్‌శర్మను తీసుకున్నాడు.

మరోవైపు గత మ్యాచ్‌లో నిలకడగా రాణించిన సన్‌రైజర్స్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా గాయం కారణంగా తుదిపోరు నుంచి తప్పుకున్నాడు. సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడి తేలిపోయిన ఖలీల్ అహ్మద్ స్థానంలో సందీప్ శర్మ, శ్రీవాత్స్ గోస్వామి జట్టులోకి వచ్చినట్లు సన్‌రైజర్స్ సారథి కేన్ విలియమ్సన్ చెప్పాడు.

ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న నాలుగో మ్యాచ్ ఇది. చెన్నైతో తలపడిన మూడు సార్లు సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో ఫైనల్‌లో ఏ జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తుందో చూడాలి.
3430
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS