బిగ్‌ఫైట్‌లో చెన్నై మురిసెన్

Sun,April 14, 2019 08:34 PM

Chennai Super Kings beat Kolkata Knight Riders by 5 wickets

కోల్‌క‌తా: ఐపీఎల్ ప‌న్నెండో సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జైత్ర‌యాత్ర కొన‌సాగుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సురేశ్ రైనా (58 నాటౌట్: 42 బంతుల్లో 7x4, 1x6), రవీంద్ర జడేజా (31 నాటౌట్: 17 బంతుల్లో 5x4) చెలరేగడంతో 5 వికెట్ల తేడాతో చెన్నై సునాయాసంగా విజయాన్ని అందుకుంది. ఆఖ‌ర్లో ఉత్కంఠ‌రేపిన‌ప్ప‌టికీ చెన్నై బ్యాట్స్‌మ‌న్ ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో టార్గెట్‌ను 19.4 ఓవ‌ర్ల‌లో ఛేదించారు. అంతకుముందు క్రిస్ లిన్ (82: 51 బంతుల్లో 7x4, 6x6) అర్ధశతకం విజృంభించ‌డంతో కోల్‌కతా 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఛేదనలో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విఫ‌ల‌మైనా.. ఆఖర్లో సురేశ్ రైనాతో కలిసి జ‌డేజా దూకుడుగా ఆడాడు. దీంతో చెన్నై మరో 2 బంతులు మిగిలి ఉండగానే విజ‌యాన్ని అందుకుంది. డుప్లెసిస్(24) మంచి ఆరంభం అందించాడు. ఈ గెలుపు చెన్నైకి ఏడోది కావ‌డం విశేషం. ఈ విజయంతో 14 పాయింట్లకి చేరుకున్న చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా కోల్‌కతా 4 విజ‌యాలు.. 8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

2895
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles