
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడవ వన్డేలో.. స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఆరు వికెట్లు తీశాడు. తన కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 42 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఆరు వికెట్లు తీసిన విదేశీ స్పిన్నర్‌గా చాహెల్ రికార్డు క్రియేట్ చేశాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసింది. వర్షం పడ్డ పిచ్‌పై ఆసీస్ రన్స్ రాబట్టేందుకు ఇబ్బందిపడింది. దీంతో ఆస్ట్రేలియా 48.4 ఓవర్లలో 230 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. హ్యాండ్స్‌కూంబ్ ఒక్కడే అత్యధికంగా 58 రన్స్ చేశాడు. ఖవాజా 34, మార్ష్ 39 రన్స్ చేశారు. మూడు వన్డేల సిరీస్‌లో రెండు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.