షేన్ వార్న్ స‌ల‌హాలు తీసుకున్న చాహెల్‌

Wed,July 10, 2019 03:01 PM

Chahal takes notes from Shane Warne

హైద‌రాబాద్‌: మేటి స్నిన్న‌ర్ షేన్ వార్న్‌.. ఇవాళ మాంచెస్ట‌ర్‌లో చాహెల్‌కు స‌ల‌హాలు ఇచ్చాడు. ఎలాంటి సంద‌ర్భంలో ఎలాంటి స్పిన్ బంతులు వేయాలో చెప్పాడు. కివీస్‌తో రిజ‌ర్వ్ డే సంద‌ర్భంగా.. ఇవాళ మ్యాచ్ కొన‌సాగ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న చాహెల్‌తో కాసేపు వార్న్ ముచ్చ‌టించాడు. బ్యాట్స్‌మెన్ ఏ పొజిష‌న్‌లో ఆడుతున్నాడో తెలుసుకుని, ఆ ప్లేయ‌ర్ల‌కు త‌గ్గ గూగ్లీ బంతుల్ని ఎలా వేయాల‌న్న పాఠాలు చాహెల్ నేర్చుకున్నాడు. ప్రాక్టీస్ సంద‌ర్భంగా విరాట్ కోహ్లీ బౌలింగ్ వేశాడు. న్యూజిలాండ్ నిన్న 46.1 ఓవ‌ర్ల‌లో అయిదు వికెట్లు కోల్పోయిన 211 ర‌న్స్ చేసింది. కివీస్ ఇంకా ఇవాళ 23 బంతులు ఆడాల్సి ఉంది. ఆ త‌ర్వాత భార‌త్ 50 ఓవ‌ర్ల‌లో టార్గెట్ చేధిస్తుంది.

1616
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles