అతడు ఔటా.. నాటౌటా.. వివాదాస్పదమైన క్యాచ్!

Fri,December 29, 2017 01:21 PM

Catch controversy erupts in Ashes series

మెల్‌బోర్న్‌ః ఆసీస్ మారలేదు.. అదే మోసం.. ఇదీ యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ అభిమానులు పాడిన పాట. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా బ్యాటింగ్‌కు వచ్చే సమయంలో వాళ్లు పెద్ద ఎత్తున అతన్ని హేళన చేశారు. దీనికంతటికీ కారణం ఓ క్యాచ్. మూడో రోజు ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ స్టువర్ట్ బ్రాడ్ ఇచ్చిన క్యాచ్‌ను ఆసీస్ ఫీల్డర్ ఖవాజా బౌండరీ దగ్గర ముందుకు డైవ్ చేస్తూ అందుకున్నాడు. బాల్ నేరుగా అతని చేతుల్లోనే పడినా.. డైవ్ చేసే క్రమంలో అది అతని చేతి నుంచి కింద పడినట్లుగా రీప్లేల్లో కనిపించింది. అయితే ఆ రీప్లేలు కూడా స్పష్టంగా ఏమీ చెప్పలేకపోయాయి. ఖవాజా మాత్రం తాను క్యాచ్ పట్టినట్లుగా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. రీప్లేలు స్పష్టంగా లేకపోయినా మూడో అంపైర్ బ్రాడ్‌ను ఔట్‌గా ప్రకటించాడు. కామెంటేటర్లు కూడా ఈ క్యాచ్‌పై రెండుగా విడిపోయారు. అది ఔటేనని ఒకరంటే.. కాదని మరొకరు వాదించుకున్నారు.


మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసిన బ్రాడ్ (63 బంతుల్లో 56) అప్పటికే కుక్‌తో కలిసి 9వ వికెట్‌కు 100 పరుగులు జోడించాడు. దీంతో ఇది చాలా కీలకమైన వికెట్‌గా మారింది. బ్రాడ్ సైలెంట్‌గా వెళ్లిపోయాడు. నాన్ ైస్ట్రెకింగ్‌లో ఉన్న కుక్ తర్వాత మాట్లాడుతూ ఈ ఘటనను లైట్ తీసుకున్నాడు. రీప్లేల్లోనూ స్పష్టంగా తేలనపుడు ఒక్కోసారి ప్లేయర్ చెప్పిందే వినాల్సి వస్తుందని, అయినా ఖవాజా అలాంటివాడు కాదంటూ అతనికి సర్టిఫికెట్ ఇచ్చాడు. కానీ ఇంగ్లండ్ అభిమానులు మాత్రం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. ఆస్ట్రేలియా ఎప్పట్లాగే మోసం చేసిందని ఆరోపించారు. ఖవాజా బ్యాటింగ్‌కు రాగానే అతన్ని హేళన చేయడంతోపాటు ఆసీస్ మారలేదు.. అలాగే మోసం చేస్తున్నది అంటూ స్టేడియం హోరెత్తాలా పాట పాడారు.

2546
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles