వోజ్నియాకి ఔట్

Mon,May 27, 2019 05:36 PM

Caroline Wozniacki knocked out in first round of French Open

హైద‌రాబాద్: ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ చాంపియ‌న్‌, మాజీ వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ క‌రోలిన్ వోజ్నియాకి ఫ్రెంచ్ ఓపెన్ నుంచి ఔటైంది. ఇవాళ జ‌రిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ఆమె ర‌ష్యాకు చెందిన 68వ నెంబ‌ర్ క్రీడాకారిణి వెరోనికా కుడ‌ర్మెటోవా చేతిలో ఓట‌మి పాలైంది. నెద‌ర్లాండ్స్‌కు చెందిన 13వ సీడ్ వోజ్నియాకి తొలి సెట్‌లో సునాయాసంగానే విజ‌యం సాధించింది. కానీ త‌ర్వాత రెండు సెట్ల‌లో ఆమె ఎటువంటి పోరాటాన్ని ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయింది. దీంతో వోజ్నియాకి 0-6, 6-3, 6-3 స్కోర్‌తో వెరోనికా చేతిలో ఓడిపోయింది. రెండ‌వ సెట్‌లో వోజ్నియాకి 10 అన‌వ‌స‌ర త‌ప్పిదాలు చేసింది. పారిస్‌లోని రోలాండ్ గారోస్ స్టేడియంలో ఈ మ్యాచ్ జ‌రిగింది.

728
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles