ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత వోజ్నియాకి

Sat,January 27, 2018 05:35 PM

Caroline Wozniacki beats Simona Halep in Australia Open

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా వోజ్నియాకి నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో సిమోనా హలెప్‌పై కరోలిన్ వోజ్నియాకి విజయం సాధించింది. హలెప్‌పై 7-6, 3-6, 6-4 తేడాతో వోజ్నియాకి గెలిచింది.

తన మొదటి ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ పతకాన్ని గెలుచుకున్న తర్వాత కరోలిన్ ఉద్వేగానికి లోనయింది. గతంలో కరోలిన్, హలెప్ ఇద్దరు గ్రాండ్ స్లామ్ ఫైనల్స్‌లో ఓడిపోయారు. హలెప్ రెండు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్‌ను గెలవగా... వోజ్నియాకి.. యూఎస్ ఓపెన్‌ను రెండు సార్లు గెలిచింది. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా గెలవడంతో ఆరు ఏండ్ల తర్వాత వోజ్నియాకి మళ్లీ నెంబర్ వన్ ర్యాంక్‌ను సాధించింది. మొత్తం మీద 43వ ప్రయత్నంలో వోజ్నియాకి ఆస్ట్రేలియా ఓపెన్‌ను గెలుచుకున్నది.
1815
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles