తెలంగాణ చేనేత వస్ర్తాల్లో కరోలినా మారిన్Fri,January 12, 2018 05:35 PM

తెలంగాణ చేనేత వస్ర్తాల్లో  కరోలినా మారిన్


చెన్నై: స్పెయిన్ బ్యాడ్మింటన్ స్టార్, రియో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత కరోలినామారిన్ తెలంగాణ చేనేత వస్ర్తాల్లో తళుక్కున మెరిసింది. బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ కోసం ప్రస్తుతం భారత్‌లో ఉన్న కరోలినా మారిన్ కు ప్రముఖ డిజైనర్ దివ్యారెడ్డి ప్రత్యేకంగా డిజైన్ చేసిన తెలంగాణ చేనేత వస్ర్తాలు అందజేశారు. చేనేత వస్ర్తాలు ధరించిన కరోలినా ఆ ఫొటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంది. ఇంత అద్భుతమైన చేనేత వస్ర్తాలను రూపొందించినందుకు దివ్యారెడ్డికి కృతజ్ఞతలు అని ట్వీట్ చేసింది. తెలంగాణ చేనేత వస్ర్తాలకు ప్రపంచస్థాయి గుర్తింపునిస్తున్న కరోలినా మారిన్‌కు ధన్యవాదాలు అని మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.

2752
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS