చెన్నైలో ఐపీఎల్‌ కెప్టెన్ల మీటింగ్‌..

Fri,March 22, 2019 06:43 PM

Captains meeting held in Chennai ahead of the #VIVOIPL 2019 season.

చెన్నై: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-12 సీజన్‌ రేపటి నుంచి ఆరంభంకానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా జట్లు లీగ్‌ కోసం సన్నద్ధమయ్యాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డిఫెండింగ్‌ ఛాంపియ‌న్‌, మహేంద్రసింగ్‌ ధోనీ సారథ్యంలోని ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య ఆరంభ పోరు రసవత్తరంగా సాగనుంది. చెన్నైలో 2019 సీజన్‌ ఆరంభానికి ముందు అన్ని టీమ్‌ల కెప్టెన్లతో లీగ్‌ నిర్వాహకులు సమావేశం ఏర్పాటు చేశారు. లీగ్‌కు సంబంధించిన విధివిధానాలు, నియమ నిబంధనలు తదితర అంశాలపై కెప్టెన్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సారథులందరూ తమ కలర్‌ఫుల్‌ జెర్సీలను ధరించి సమావేశానికి హాజరైన ఫొటోలను ఐపీఎల్‌ అభిమానులతో పంచుకుంది. పుల్వామా ఉగ్రదాడికి సంతాపంగా అట్టహాసంగా నిర్వహించాల్సిన ఐపీఎల్‌ ఆరంభోత్సవ వేడుకలను బీసీసీఐ రద్దు చేసిన విషయం తెలిసిందే.

2459
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles