విశ్వవిజేతలకు బ్రిటన్‌ ప్రధాని ఆతిథ్యం

Tue,July 16, 2019 01:15 PM

British PM Theresa May Hosts Victorious England Cricket Team

లండన్‌: ఉత్కంఠభరితంగా సాగిన ప్రపంచకప్‌ ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టు విశ్వవిజేతగా నిలువడంతో ఇంగ్లాండ్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఇంకా సంబరాల్లోనే ఉన్నారు. దేశవ్యాప్తంగా క్రికెట‌ర్ల‌పై అభినందనలు, ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఐసీసీ 12వ వరల్డ్‌కప్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ టీమ్‌కు బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే ఆతిథ్యమిచ్చారు. నంబర్‌ 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లో గల ప్రధాని అధికారిక నివాసంలో వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ క్రికెటర్లకు సోమవారం విందు ఏర్పాటు చేశారని ఆమె ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌తో కలిసి ట్రోఫీని పట్టుకొని క్రికెటర్లతో కలిసి ఫొటోలు దిగారు. విందు కార్యక్రమంలో థెరిసా మే ఆటగాళ్లతో చాలా ఉత్సాహంగా గడిపారు.


1794
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles