ఫుట్‌బాల్ వరల్డ్‌కప్.. బ్రెజిల్ మ్యాచ్ డ్రా

Mon,June 18, 2018 11:01 AM

 Brazil failed to win their opening game in the football worldcup

రాస్తోవ్ ఆన్ డాన్: టోర్నమెంట్ ఫెవరేట్ బ్రెజిల్ తొలి మ్యాచ్‌లో ఆశించినంతగా రాణించలేదు. వరల్డ్ కప్ ఫుట్‌బాల్ గ్రూప్ ఈ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్, బ్రెజిల్ మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. గతంలో అయిదు సార్లు వరల్డ్ కప్ గెలిచిన బ్రెజిల్ ఆరంభంలో దూకుడును ప్రదర్శించింది. ఆట 20వ నిమిషంలోనే ఫిలిప్ కోర్టినో గోల్ చేశాడు. అటాకింగ్ గేమ్ ఆడినా బ్రెజిల్‌కు ఆ తర్వాత గోల్స్ దక్కలేదు. సెకండ్ హాఫ్‌లో స్విట్జర్లాండ్ ప్లేయర్ స్టీవన్ జుబర్ హెడ్ గోల్ చేశాడు. ఆట 50వ నిమిషంలో అతను ఆ గోల్ కొట్టాడు. వరుసగా తొమ్మిది వరల్ట్‌కప్ పోటీల్లో మొదటి మ్యాచ్‌ను నెగ్గిన బ్రెజిల్ ఈసారి మాత్రం తన సత్తాను చాటలేకపోయింది. గ్రూప్ ఈలో ప్రస్తుతం సెర్బియా టాప్‌లో ఉంది.

839
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles