ఓపెనర్లు ఔట్.. మూడో టెస్ట్ ఆడే టీమ్ ఇదే

Tue,December 25, 2018 11:40 AM

Both Openers dropped from the team as Mayank Agarwal to make Debut

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో జరగబోయే మూడో టెస్ట్ కోసం తుది జట్టును ప్రకటించింది టీమిండియా మేనేజ్‌మెంట్. టీమ్‌లో ఏకంగా మూడు మార్పులు చేశారు. తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైన ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్‌లను టీమ్‌లో నుంచి తొలగించడం విశేషం. మరోవైపు స్పిన్నర్ అశ్విన్ కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో మూడో టెస్టుకూ దూరం కానున్నాడు. అటు పేస్‌బౌలర్ ఉమేష్ యాదవ్‌ను కూడా తప్పించారు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకున్నారు. రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్‌కు చోటు కల్పించారు. మయాంక్ తన తొలి టెస్ట్ ఆడబోతున్నాడు. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో ప్రస్తుతం రెండు జట్లు 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే.

మెల్‌బోర్న్ టెస్ట్‌కు టీమ్ ఇదే:

విరాట్ కోహ్లి, అజింక్య రహానే, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, చెతేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా

5051
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles