భారత్, పాక్ మ్యాచ్: టీమిండియాకు బీఎస్‌ఎఫ్ జవాన్ల మద్దతు.. వీడియో

Sun,June 16, 2019 07:31 PM

Border Security Force personnel cheer for Team India

దేశమంతా ఇప్పుడు ఒకవైపే చూస్తోంది. అదే భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్‌పై. వరుణుడు ఈ మ్యాచ్‌కు అడ్డంకి కలిగిస్తాడని అనుకున్నా మ్యాచ్ ప్రారంభం అయ్యే సమయానికి మాంచెస్టర్‌లో ఎటువంటి వర్షం లేదు. భారత్ బ్యాటింగ్ ఆరంభించాక.. 46.4 ఓవర్ వద్ద వర్షం మ్యాచ్‌కు అడ్డం వచ్చింది. దీంతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. వర్షం ఆగిపోగానే.. మ్యాచ్ మళ్లీ ప్రారంభం అయింది.

అయితే.. చిరకాల ప్రత్యర్థి పాక్‌తో భారత్ తలపడుతున్న నేపథ్యంలో బీఎస్‌ఎఫ్ జవాన్లు.. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న బీఎస్‌ఎఫ్ హెడ్‌క్వార్టర్ వద్ద భారత్, పాక్ మ్యాచ్‌ను తిలకిస్తూ.. టీమిండియాకు చీర్ చెబుతున్నారు. డోలు వాయిస్తూ భారత్.. భారత్ అంటూ మద్దతు పలుకుతున్నారు.

5065
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles