జలగండం: చెన్నై జట్టుకు మరో షాక్

Fri,April 13, 2018 06:31 PM

Bombay HC issues notice to MCA for water use plan in Puneముంబయి: ఐపీఎల్-11లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు విషయమై తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డుకుంటామని వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు నిరసనలు చేయడంతో చెన్నై ఆడే మ్యాచ్‌లను పుణెకు తరలించారు. ఇప్పుడు పుణె ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి బాంబే హైకోర్టు వివరణ కోరడంతో చెన్నై ఫ్రాంఛైజీ ఆందోళన చెందుతోంది.


పుణె వేదికగా జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ కోసం వినియోగించే నీటిని ఎలా సమకూర్చుకుంటున్నారో తమకు వివరణ ఇవ్వాలని శుక్రవారం మహారాష్ట్ర క్రికెట్ సంఘం(ఎంసీఏ)కు కోర్టు నోటీసులు పంపించింది. చెన్నైలో నిర్వహించాల్సిన మ్యాచ్‌లను పుణెలో నిర్వహిస్తామని చెన్నై యాజమాన్యం, ఐపీఎల్ నిర్వాహకులు అధికారికంగా తెలిపిన మరుసటి రోజే కోర్టు నోటీసులు పంపడం గమనార్హం. నోటీసులపై ఏప్రిల్ 18లోగా సమాధానం చెప్పాలని గడువు విధించింది. మ్యాచ్‌ల కోసం పిచ్‌ను తయారుచేసేందుకు లక్షలాది లీటర్ల నీటిని ఉపయోగిస్తారు.

ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం పిచ్‌ నిర్వహణకు గాను 60 లక్షల లీటర్ల నీటిని వృథా చేస్తున్నారంటూ లోక్‌ సత్తా మూమెంట్‌ అనే స్వచ్ఛంద సంస్థ 2016లో బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విష‌యం తెలిసిందే.

5092
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles