బిస్కెట్ ట్రోఫీ.. క్రికెట్ చరిత్రలోనే ఇదో వింత ట్రోఫీ!

Wed,October 24, 2018 12:49 PM

Biscuit Trophy launched by Australia and Pakistan Teams captains leave twitter in splits

అబుదాబి: ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య బుధవారం నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ కోసం రూపొందించిన ట్రోఫీపై ఇప్పుడు ట్విటర్‌లో చర్చ జరుగుతున్నది. ఈ సిరీస్ కోసం బిస్కెట్ రూపంలో ఉన్న ట్రోఫీని నిర్వాహకులు తయారు చేశారు. క్రికెట్ చరిత్రలోనే వింతయిన ఈ ట్రోఫీని చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఈ ట్రోఫీలో కింద ఓ క్రికెట్ బాల్, దానిపై మూడు స్టంప్స్, ఆపైన ఓ బిస్కెట్‌ను ఉంచారు. ట్రోఫీని లాంచ్ చేసినప్పటి నుంచీ ట్విటర్ దీనిపైనే చర్చించుకుంటున్నది. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్, పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఈ ట్రోఫీని లాంచ్ చేశారు. ఐసీసీ కూడా ఈ ట్రోఫీ లాంచ్‌పై ప్రత్యేకంగా ట్వీట్ చేయడం విశేషం. మరి ఈ బిస్కెట్ ట్రోఫీని ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.
3396
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles