భువీ ఖాతాలో 100 వికెట్లు

Sat,January 12, 2019 09:06 AM

Bhuvneshwar Kumar picks up his 100th ODI wicket at Sydney game

సిడ్నీ: టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ వ‌న్డేల్లో వంద వికెట్లు తీసిన ప్లేయ‌ర్ల జాబితాలో చేరాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో.. భువీ అద్భుత‌మైన బంతితో ఓపెన‌ర్ ఫించ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. లెన్త్‌లో ప‌డిన బంతిని ఫించ్ స‌రిగా ఆడ‌లేక‌పోయాడు. బ్యాట్‌, ప్యాడ్ మ‌ధ్య గ్యాప్ ఉండ‌డంతో ఆసీస్ ఓపెన‌ర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 11 బంతులు ఆడిన ఫించ్ కేవ‌లం 6 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా 17 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు కోల్పోయి 75 ర‌న్స్ చేసింది.2328
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles