నెట్స్‌లో నోబాల్ వేశాడు.. బుక్కయ్యాడు!

Tue,July 17, 2018 12:07 PM

Bhuvaneshwar Kumar trolled for over stepping in the nets

లండన్: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ భువనేశ్వర్‌కుమార్ గాయం కారణంగా తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్నాడు. మూడో వన్డేకు ముందు అతను నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ఇది నిజంగా టీమ్‌కు గుడ్‌న్యూసే. నిర్ణాయాత్మక మూడో వన్డేలో భువీలాంటి సీనియర్ బౌలర్ సేవలు టీమ్‌కు చాలా అవసరం. దీంతో అతడు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియోను బీసీసీఐ ఎంతో ముచ్చటపడి పోస్ట్ చేసింది. ఫ్యాన్స్ ఇది చూసి చాలా ఖుష్ అవుతారని బోర్డు భావించినట్లుంది.


అయితే ఫ్యాన్స్ మాత్రం మరోలా ఆలోచించారు. ఆ వీడియోలో భువనేశ్వర్ నోబాల్ వేయడాన్ని గుర్తించారు. భువీని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అదో పెద్ద నోబాల్.. బౌలర్లు నెట్స్‌లో నోబాల్స్ వేస్తుంటే బౌలింగ్ కోచ్ ఏంచేస్తున్నాడంటూ నెటిజన్లు ప్రశ్నించారు.


అభిమానుల ట్రోలింగ్ ఎలా ఉన్నా.. మూడో వన్డేకు భువనేశ్వర్ టీమ్‌లోకి తిరిగొస్తే మాత్రం అది పెద్ద ప్లస్ అవుతుంది. రెండో వన్డేలో టీమిండియా బౌలింగ్‌ను సునాయాసంగా ఆడేశారు ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్. కేవలం కుల్‌దీప్ మాత్రమే ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను పరీక్షిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భువీ టీమ్‌లోకి వస్తే బౌలింగ్ డిపార్ట్‌మెంట్ కాస్త పటిష్ఠమవుతుంది.

4901
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS