స్టోక్స్ క‌ళ్లు చెదిరే క్యాచ్‌.. వీడియో

Fri,May 31, 2019 11:12 AM

Ben Stokes takes stunning catch in match against south africa

హైద‌రాబాద్: బెన్ స్టోక్స్ క‌ళ్లు చెదిరే క్యాచ్ ప‌ట్టాడు. సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షో క‌న‌బ‌రిచిన స్టోక్స్ సూప‌ర్ క్యాచ్ అందుకున్నాడు. బ్యాటింగ్‌లో చక్కటి ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన బెన్ స్టోక్స్.. ఫీల్డింగ్‌లోనూ మెరుపులతో మైమరిపించాడు. అప్పటికే డుమినీ క్యాచ్‌తో పాటు ప్రిటోరియస్ రనౌట్‌లో భాగమైన బెన్.. ఫెలుక్వాయో క్యాచ్‌ను అద్భుతం అనే రీతిలో అందుకున్నాడు. రషీద్ బౌలింగ్‌లో మిడ్‌వికెట్ దిశగా ఫెలుక్వాయో కొట్టిన బంతిని స్టోక్స్ గాల్లో పక్షిలా ఎగురుతూ ఒంటిచేత్తో ఒడిసి పట్టి ఔరా అనిపించాడు. వ‌ర‌ల్డ్‌క‌ప్ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఇదిగో వీడియో.

2088
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles