లోధా జీ.. సంస్కరణలు మా వల్ల కాదు: బీసీసీఐ

Sun,November 6, 2016 09:22 AM

BCCI tells Lodha panel it cannot implement reforms

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశించిన లోధా కమిటీ సిఫారసులను అమలు చేయడం తమ వల్ల కాదని బీసీసీఐ చెప్పకనే చెప్పింది. రాష్ట్ర సంఘాలు కొన్ని సంస్కరణలు అమలును తీవ్రంగా వ్యతిరేకిస్తోందని బోర్డు లోధా కమిటీకి తెలిపింది. బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలు శనివారం లోధా కమిటీ ముందు అఫిడవిట్లు దాఖలు చేశారు. లోధా సంస్కరణల్లో కొన్నింటిని అమలు చేసేందుకు సభ్యులు ఒప్పుకోవడం లేదని తన ఏడు పేజీల అఫిడవిట్‌లో ఠాకూర్ పేర్కొన్నారు. వీటికి సంబంధించి 50 పేజీల సపోర్టింగ్ డాక్యుమెంట్లను కూడా పొందుపర్చారు. సంస్కరణలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన బోర్డు సమావేశం మినిట్స్‌ను కూడా కమిటీకి అందజేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ఆదేశాలు ఇవ్వాలని నివేదికలో విజ్ఞప్తి చేశాడు. పార్లమెంట్ సమావేశాల కారణంగా ఆగస్టు 9న వ్యక్తిగతంగా హాజరుకాలేకపోయానని తెలిపాడు.

2243
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles