ఐపీఎల్ నుంచి బీసీసీఐకి రూ.2వేల కోట్లు..

Tue,February 13, 2018 03:38 PM

BCCI set to earn over Rs 2000 crore from IPL


న్యూఢిల్లీ: ప్రపంచలో అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) భారీగా ఆర్జించేందుకు ప్రణాళికలు వేస్తోంది. అంతర్జాతీయంగా విశేషాదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ద్వారా రూ.2వేల కోట్లకు పైగా లాభాన్ని పొందాలని భావిస్తోంది. 2008లో ఆరంభమైన ఐపీఎల్ ద్వారానే బోర్డుకు 95శాతం మిగులు ఆదాయం వస్తోంది. ఏడాదిలో మిగిలిన 320 రోజులతో పోలిస్తే 45రోజుల పాటు జరిగే ఐపీఎల్‌తో 16రెట్ల ఆదాయాన్ని బీసీసీఐ పొందనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆదాయం, ఖర్చులను లెక్కించగా ఐపీఎల్ ద్వారా దాదాపు రూ.2,017కోట్ల మిగులు ఆదాయం బీసీసీఐ ఖజానాలోకి చేరనుంది. అంతర్జాతీయ పర్యటనలు, దేశవాళీ టోర్నీల ద్వారా కేవలం రూ.125కోట్లు మాత్రమే వస్తోంది. ఇంత మొత్తంలో ఆదాయం వచ్చేందుకు ఐదేళ్లపాటు ఐపీఎల్ ప్రసార హక్కులు దక్కించుకున్న స్టార్ ఇండియా రూ.16,347కోట్లను బోర్డుకు చెల్లించనుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో బోర్డు ఆదాయం గణనీయంగా పెరుగుతోంది.

1583
Follow us on : Facebook | Twitter
Tags
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS