అవును.. కోహ్లి చెప్పింది నిజమే!

Thu,November 23, 2017 05:40 PM

BCCI Seriously assess what Virat Kohli Said says acting president CK Khanna

ముంబై: సౌతాఫ్రికాలాంటి కీలకమైన సిరీస్‌కు సన్నద్ధమవడానికి సరైన సమయం ఇవ్వరా అంటూ ప్రశ్నించిన కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యలను సమర్థించారు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా. దీనిపై సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని ఆయన స్పష్టంచేశారు. తక్కువ సమయంలో మూడు వరుస సిరీస్‌లను షెడ్యూల్ చేయడంపై బోర్డు సభ్యులు మరోసారి ఆలోచించాలని ఖన్నా చెప్పారు. విరాట్ ఇండియన్ టీమ్ కెప్టెన్. అతని అభిప్రాయాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. టీమ్ రాణిస్తున్నా.. ప్లేయర్స్ అలసిపోతున్నారంటే ఇది సీరియస్‌గా చర్చించాల్సిన విషయం అని సీకే ఖన్నా అన్నారు. డిసెంబర్ 9న జరిగే బీసీసీఐ స్పెషల్ జనరల్ మీటింగ్ ఎజెండాలో ఈ సమస్యను చేరిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఐపీఎల్ నుంచి ఇండియన్ ప్లేయర్స్ వరుస సిరీస్‌లతో సతమతమవుతున్నారు. చాంపియన్స్ ట్రోఫీ, వెస్టిండీస్, శ్రీలంక పర్యటనలు.. సొంతగడ్డపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంకలతో సిరీస్‌లు.. ఆ వెంటనే కీలకమైన సౌతాఫ్రికా టూర్ ప్లేయర్స్‌పై పనిభారాన్ని విపరీతంగా పెంచుతున్నది. ఇదే అంశంపై కోహ్లి అసంతృప్తి వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.

నిజానికి 2023 వరకు ప్రతి ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలు పాకిస్థాన్‌తో సిరీస్ కోసం కేటాయించిన సమయం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో వాటి స్థానంలో వేరే సిరీస్‌లను బోర్డు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్, శ్రీలంక సిరీస్‌లు అందులో భాగమే అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి చెప్పారు. ఇక ఐసీసీలో కీలకమైన అంశాల్లో శ్రీలంక బోర్డు మొదటి నుంచీ ఇండియాకు మద్దతుగా ఉండటంతో ఆ టీమ్‌తో తరచూ సిరీస్‌లు ఏర్పాటు చేస్తున్నది బీసీసీఐ. దీనివల్ల అటు కష్టాల్లో ఉన్న శ్రీలంక బోర్డుకు కూడా కాస్త ఆదాయాన్ని వెనుకేసుకొనే అవకాశం దక్కింది. ఇప్పుడు సౌతాఫ్రికా సిరీస్ ముగిసిన తర్వాత వచ్చే ఏడాది మార్చిలో శ్రీలంకలో మరో ట్రయాంగిల్ టోర్నీ ఇండియా ఆడాల్సి ఉంది. అయితే కోహ్లి అంతటి వాడే చెప్పడంతో బిజీ షెడ్యూల్‌పై బీసీసీఐ సీరియస్‌గా ఆలోచన చేస్తున్నది.

2270
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS