స‌చిన్ అయితే ఏంటి? మొత్తం డ‌బ్బు ఇవ్వాల్సిందే!

Fri,April 21, 2017 12:54 PM

BCCI refuses to give concession to Sachins Movie producer for using batsmans footage

ముంబై: స‌చిన్ సినిమా అయినా.. ఇంకెవ‌రి సినిమా అయినా.. మాకంటూ ఓ రేటుంది.. అదిచ్చి ఫుటేజీ కొనుక్కోవాల్సిందే.. ఇందులో ఎవ‌రికీ ఎలాంటి రాయితీలు, మిన‌హాయింపులూ ఉండ‌వు.. ఇదీ బీసీసీఐ మాట‌. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ జీవిత చ‌రిత్ర‌పై తెర‌కెక్కి స‌చిన్‌: ఎ బిలియ‌న్ డ్రీమ్స్ సినిమా కోసం అత‌డు ఆడిన విజువ‌ల్స్‌ను చిత్ర నిర్మాణ సంస్థ త‌మ ద‌గ్గ‌ర కొనుక్కోవాల్సిందేన‌ని బోర్డు స్ప‌ష్టంచేసింది. ఎవ‌రైనా ఏ ప్లేయ‌ర్ ఆడిన విజువ‌ల్స్ అయినా వాణిజ్య అవ‌స‌రాల కోసం వాడుకోవాలంటే త‌మ‌కు డ‌బ్బు చెల్లించాల్సిందేన‌ని గ‌తంలోనే బోర్డు చెప్పింది. ప్ర‌తి దానికీ ఓ రేటు కార్డును కూడా బోర్డు నిర్ణ‌యించింది.

స‌చిన్ చిత్రాన్ని తెర‌కెక్కించిన 200 నాటౌట్ నిర్మాణ సంస్థ‌కు కూడా బోర్డు ఇదే విష‌యాన్ని చెప్పింది. అయితే వాంఖ‌డే స్టేడియంలో స‌చిన్ ఇచ్చిన రిటైర్మెంట్ సందేశాన్ని మాత్రం ఉచితంగా ఇవ్వ‌డానికి అంగీక‌రించింది. గ‌తంలో ధోనీ సినిమా కోసం అరున్ పాండే ఇలాగే అత‌ని ఫుటేజీని బోర్డుకు డ‌బ్బిచ్చి కొనుగోలు చేశాడు. బీసీసీఐకి ఒక విధానం ఉంది. ధోనీ సినిమాకు రాయితీ ఇవ్వ‌లేదు. మ‌రి స‌చిన్‌కు ఎలా ఇస్తాం. ఇది ఓ వాణిజ్య చిత్రం. థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శిస్తారు. దీనివ‌ల్ల నిర్మాత‌ల‌కు లాభ‌మే క‌దా అని బోర్డులోని ఓ సీనియ‌ర్ అధికారి అన్నారు. అయితే బోర్డుతో ఇంకా చ‌ర్చ‌లు న‌డుస్తూనే ఉన్నాయ‌ని సినిమా నిర్మాత‌, 200 నాటౌట్ వ్య‌వ‌స్థాప‌కుడు ర‌వి భాగ్‌చంద్కా వెల్ల‌డించారు. ఈ సినిమా మే 26న విడుద‌ల కానుంది.

2404
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS