శ్రీలంకపై బంగ్లా చారిత్రక విజయం

Sun,March 11, 2018 07:21 AM

Bangladesh wins against srilanka in t20

కొలంబో: ముష్ఫికర్ రహీమ్ (35 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుతమైన బ్యాటింగ్‌తో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చారిత్రక విజయాని నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక విధించిన 215 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 19.4 ఓవర్లలోనే ఛేదించి తొలి మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నది. టీ20ల్లో బంగ్లాకు ఇదే అత్యుత్తమ ఛేజింగ్. తమిమ్ (47), లిట్టన్ (43) శుభారంభం అందించగా..రహీమ్ 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి బంగ్లా విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. కుశాల్ (74), మెండిస్ (57) రాణించగా..చివర్లో తరంగ (32 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ముస్తఫిజుర్‌కు 3, మహ్మదుల్లాకు 2 వికెట్లు దక్కాయి.

4237
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles