ఆ సిరీస్‌లో భారత్ తర్వాత బంగ్లాదే ఆధిపత్యం

Fri,February 23, 2018 04:34 PM

Bangladesh second strongest after India, says Sanjay Manjrekarన్యూఢిల్లీ: ట్రై సిరీస్‌లో భాగంగా వచ్చే నెల శ్రీలంక పర్యటనలో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక పాల్గొననున్నాయి. ఈ సందర్భంగా మూడు జట్ల మధ్య పోరుపై భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ స్పిందించారు. అంతర్జాతీయ క్రికెట్లో తమ ప్రదర్శనను మెరుగుపరచుకునేందుకు బంగ్లాదేశ్‌కు ఇదో సువర్ణావకాశమని అన్నారు. ఈ మూడు జట్లలో టీమిండియా తరువాత అత్యంత బలమైన జట్టు బంగ్లానే అని చెప్పారు. ఏళ్లు గడుస్తున్నా కొద్దీ బంగ్లాదేశ్ నెమ్మదిగా బలమైన జట్టుగా అవతరిస్తోంది. ఆటగాళ్ల ఫిట్‌నెస్, ఆత్మవిశ్వాసం, శారీరకంగానూ బలంగా ఉండటం వల్లే ఇది సాధ్యమవుతుంది. ఆ జట్టులో ఇద్దరు ప్రపంచస్థాయి , మ్యాచ్‌ను మలుపుతిప్పే ఆటగాళ్లు షకిబ్, ముస్తాఫిజుర్ ఉన్నారు. వాళ్లిద్దరు మాత్రమే కాదు తమిమ్ ఇక్బాల్ కూడా ప్రత్యేకమైన ఆటగాడే. బంగ్లాదేశ్‌లో క్రికెట్ ఎదుగుదల గొప్ప విషయం. అక్కడ క్రికెట్ అధిక ప్రాధాన్యం ఇస్తారని మంజ్రేకర్ పేర్కొన్నారు.

2953
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles