లంచ్ విరామానికి బంగ్లా స్కోరు 63/3

Thu,November 14, 2019 11:58 AM

ఇండోర్: భారత్‌తో తలపడుతోన్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ లంచ్ విరామ సమయానికి 26 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి, 63 పరుగులు సాధించింది. కెప్టెన్ మొమినల్ హక్ (22), ముష్ఫికర్ రహీమ్ (14) క్రీజులో ఉన్నారు. కీలకమైన బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్‌కు లైఫ్ లభించింది. ఉమేష్ బౌలింగ్‌లో రెండో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ కోహ్లి అతని క్యాచ్‌ని జారవిడిచాడు. దీంతో, ఊపిరి పీల్చుకున్న ముష్ఫికర్ జాగ్రత్తగా ఆడుతున్నాడు. భారత పేసర్లు ఉమేష్, ఇషాంత్, షమీ తలో వికెట్ పడగొట్టారు.



416
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles