పాపం స్మిత్.. జాలి చూపిన డివిలియర్స్

Fri,April 27, 2018 01:17 PM

Ban on Steve Smith very harsh says AB de Villiers

బెంగళూరు: బాల్ టాంపరింగ్ కు పాల్పడి ఏడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై జాలి చూపించాడు సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్. అతనికి వేసిన శిక్ష చాలా కఠినమైనదని ఏబీ అన్నాడు. ఇది చాలా సీరియస్ విషయం. అయితే దీనిని మరీ వాళ్లను వ్యక్తిగతంగా బాధించే స్థాయికి తీసుకెళ్లారు. వాళ్లను చూస్తే బాధేసింది. ముఖ్యంగా స్మిత్‌ని చూస్తే.. అతను తన ప్లేయర్స్‌కు అండగా నిలిచాడు. అతనికి విధించిన శిక్ష చాలా కఠినమైంది అని ఏబీ చెప్పాడు.

తప్పు తప్పే. బంతిని రివర్స్ స్వింగ్ చేయడానికి వాళ్లు ప్రయత్నించారు. కానీ అది చట్టాలకు లోబడే చేయాలి. సాండ్‌పేపర్‌తో చేయడం నమ్మలేకపోతున్నా. అది నా బ్యాగులో కూడా ఉంటుంది. కానీ దానిని నా బ్యాట్‌ను శుభ్రం చేయడానికి వాడుతా అని అతను అన్నాడు. అయితే స్లెడ్జింగ్, టాంపరింగ్, క్రమశిక్షణ విచారణలు, నిషేధాలు వంటి ఎన్నో వివాదాలు ఉన్నా.. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ను తాను బాగా ఎంజాయ్ చేశానని ఏబీ చెప్పాడు. కేవలం ఆట పరంగా చూస్తే మాత్రం తాను ఆడిన అత్యుత్తమ సిరీస్‌లో ఇదీ ఒకటి అని అన్నాడు.

3349
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles