ర‌విశాస్త్రిపై అజ‌ర్ గ‌రంగ‌రంWed,January 11, 2017 02:03 PM
ర‌విశాస్త్రిపై అజ‌ర్ గ‌రంగ‌రం

హైద‌రాబాద్‌: టీమిండియా బెస్ట్ కెప్టెన్స్ అంటూ మాజీ క్రికెట‌ర్ ర‌విశాస్త్రి రిలీజ్ చేసిన లిస్ట్‌పై చ‌ర్చ రోజురోజుకూ ఆసక్తిగా మారుతోంది. తాజాగా ఈ జాబితాపై స్పందించాడు మాజీ కెప్టెన్‌, హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్‌మ‌న్ అజారుద్దీన్‌. ఈ లిస్ట్‌లో గంగూలీ పేరు లేక‌పోవ‌డంపై అజ‌ర్ మండిప‌డ్డాడు. ఇది నిజంగా తెలివి త‌క్కువ నిర్ణ‌య‌మ‌ని ర‌విశాస్త్రిని విమర్శించాడు. అత‌నికి గ‌ణాంకాలు క‌నిపించ‌డం లేదా. వ్యక్తుల గురించి అత‌ను ఏమ‌నుకుంటున్నాడ‌న్న‌ది అన‌వ‌స‌రం. కానీ టీమిండియా బెస్ట్ కెప్టెన్స్ లిస్ట్ త‌యారుచేసిన‌పుడు అత‌ని వ్య‌క్తిగ‌త విభేదాల‌ను తెర‌పైకి తెచ్చి టీమ్‌కు ఎన్నో మ‌ర‌పురాని విజ‌యాలు అందించిన వారిని అవ‌మానించ‌కూడ‌దు అని అజ‌ర్ స్ప‌ష్టంచేశాడు.

27 టెస్టు విజ‌యాల‌తో టీమిండియా మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ధోనీ నిలిచాడు. దాదా ఆఫ్ ఆల్ కెప్టెన్స్ అంటూ ర‌విశాస్త్రి ధోనీని అభివ‌ర్ణించాడు. అయితే 21 విజ‌యాల‌తో అత‌ని వెంటే రెండోస్థానంలో ఉన్న గంగూలీని మాత్రం ర‌విశాస్త్రి విస్మ‌రించాడు. టీమిండియా కోచ్ ఎంపిక విష‌యంలోనే ఈ ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు బ‌య‌ట‌ప‌డిన విష‌యం తెలిసిందే. త‌న‌కు కోచ్ ప‌ద‌వి ప‌క్కా అని ర‌వి భావించినా.. చివ‌రి నిమిషంలో చ‌క్రం త‌ప్పిన గంగూలీ.. కుంబ్లేను తీసుకొచ్చాడు. అప్పుడే ఇద్ద‌రి మ‌ధ్యా మాట‌ల‌యుద్ధం న‌డిచింది. అది మ‌న‌సులో పెట్టుకొనే ర‌విశాస్త్రి త‌న జాబితాలో నుంచి గంగూలీ పేరును త‌ప్పించాడు.

1915
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS