ఆస్ట్రేలియాకు షాక్.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం

Tue,June 11, 2019 04:54 PM

Australias Marcus Stoinis has been ruled out of   game against Pakistan

లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో ఆటగాళ్ల గాయాల బెడదతో ఆయా జట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. టోర్నీలో విజయాల సంగతేమో కానీ ఆటగాళ్ల గాయాలే అసలు సమస్యగా మారింది. తాజాగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినీస్ పక్కటెముకల నొప్పితో బుధవారం పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో మిచెల్ మార్ష్‌తో భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మార్ష్ ఆస్ట్రేలియా నుంచి ఇంగ్లాండ్ బయలుదేరాడు. అధికారికంగా మార్ష్ ఎంపికను క్రికెట్ ఆస్ట్రేలియా ఐసీసీకి వెల్లడించలేదు. ప్రస్తుతానికైతే స్టాయినీస్ జట్టుతోనే ఉన్నాడు. ఒకవేళ గాయం నుంచి అతడు కోలుకుంటే మిగతా మ్యాచ్‌ల్లో అతన్ని కొనసాగించనున్నారు. ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ఆసీస్ ఒటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లలో 62 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు.

7943
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles