టీమిండియాను హేళన చేస్తారా.. మీడియాపై ఆస్ట్రేలియా ప్రజల ఆగ్రహం

Tue,December 4, 2018 10:33 AM

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ క్రికెట్ ఎలాంటిదో అక్కడి మీడియా కూడా అలాంటిదే. తమ దేశ పర్యటనకు వచ్చిన క్రికెట్ టీమ్స్‌ను ఆట మొదలయ్యే ముందే మాటలతో సగం దెబ్బతీస్తారు. ఫీల్డ్‌లో క్రికెటర్ల స్లెడ్జింగ్ కంటే దారుణంగా బయట మీడియా ప్రత్యర్థి టీమ్స్‌ను చీల్చి చెండాడుతుంది. ప్రస్తుతం ఆ దేశంలో పర్యటిస్తున్న టీమిండియాకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. తొలి టెస్ట్ కోసం కోహ్లి సేన అడిలైడ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలుసు కదా. ఈ వార్తను ప్రచురిస్తూ ఓ ఆస్ట్రేలియా పత్రిక టీమిండియాను హేళన చేసింది. భయపడే బ్యాట్లు వచ్చేశాయి అంటూ హెడింగ్ పెట్టి కథనం రాశారు. ఆస్ట్రేలియా పిచ్‌లలోని బౌన్స్‌కు టీమిండియా బ్యాట్స్‌మెన్ భయపడతారన్న ఉద్దేశంతో ఆ పత్రిక ఇలా రాసింది. సహజంగా తమ క్రికెటర్లు, మీడియాకు అక్కడి అభిమానులు కూడా అండగా ఉంటారు. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఆసీస్ మీడియాపై తీవ్రంగా మండిపడ్డారు. సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత పర్యటనలో కోహ్లి ఇక్కడ నాలుగు సెంచరీలు చేశాడని, విజయ్ 60 సగటుతో, రహానే 57 సగటుతో పరుగులు సాధించిన విషయాన్ని మరచిపోవద్దని ఒకరు గుర్తు చేయగా.. ఆస్ట్రేలియా మీడియా అంత మెదడు లేని మనుషులు ఈ దేశంలో లేరు అని మరొకరు ట్వీట్ చేశారు.


2573
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles