విరాట్ సేన‌ను అవ‌మానించిన ఆస్ట్రేలియా జ‌ర్న‌లిస్ట్‌

Wed,September 13, 2017 01:15 PM

Australian Journalist insults Virat Kohli and Team

చెన్నై: ఇండియ‌న్ టీమ్‌తో సిరీస్ మొద‌ల‌య్యే ముందు ఆస్ట్రేలియా మీడియా ఎక్స్‌ట్రాలు చేస్తున్న‌ది. మైండ్ గేమ్స్ పేరుతో దిగ‌జారుడు కామెంట్స్ చేస్తున్న‌ది. తాజాగా పాకిస్థాన్‌, వ‌ర‌ల్డ్ ఎలెవ‌న్ మధ్య నిన్న లాహోర్‌లోని గ‌డాఫీ స్టేడియంలో తొలి టీ20 జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు లింకు పెడుతూ.. ఓ ఆస్ట్రేలియా జ‌ర్న‌లిస్ట్ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతున్న‌ది. దీనిపై ఇండియ‌న్ టీమ్ ఫ్యాన్స్ గ‌ట్టిగానే రిప్లైలు ఇచ్చారు. విరాట్ అండ్ టీమ్ స్వ‌చ్ఛ‌భార‌త్‌లో భాగంగా గతేడాది ఓ స్టేడియాన్ని ఊడ్చే ఫొటోను ఆ జ‌ర్న‌లిస్ట్ వాడుకున్నాడు. చూడండి.. వ‌ర‌ల్డ్ ఎలెవ‌న్ మ్యాచ్‌కు ముందు స్వీప‌ర్స్ స్టేడియాన్ని ఊడ్చి సిద్ధం చేస్తున్నారు అని ట్వీట్ చేశాడు.


దీనిపై అభిమానులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. పాకిస్థాన్‌లోని విరాట్ ఫ్యాన్స్ కూడా ఆ జ‌ర్న‌లిస్ట్‌కు త‌గిన బుద్ధి చెప్పారు. అవును అత‌నే స్వీప‌రే.. రాబోయే ఆస్ట్రేలియా సిరీస్‌ను కూడా అలాగే స్వీప్ చేస్తాడ‌ని, అత‌నొక్క‌డు చాలు మీ టీమ్ ఏడు జ‌న‌రేష‌న్స్‌ను కొని పారేస్తాడ‌ని మ‌రొక‌రు ఇలా ట్వీట్ల‌తో ఆ జ‌ర్న‌లిస్ట్ మొహంపై కొట్టారు.


ఈ నెల 17 నుంచి ఆసీస్‌తో టీమిండియా ఐదు వ‌న్డేల సిరీస్‌లో తల‌ప‌డ‌నుంది. చెన్నైలో తొలి వ‌న్డే జ‌ర‌గ‌నుంది.

5282
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS