ఆస్ట్రేలియా బౌలర్‌తో ఆడుకున్న నెటిజన్లు

Mon,October 9, 2017 05:44 PM

Australian Bowler Mitchell Johnson trolled by Indian Fans over Nehra

ముంబై: ప్రత్యర్థి ప్లేయర్స్‌పై నోరు పారేసుకోవడం ఆస్ట్రేలియా ప్లేయర్స్‌కు కొత్త కాదు. తాజాగా ఆ టీమ్ మాజీ పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్ కూడా మన టీమిండియా పేసర్ ఆశిష్ నెహ్రాను ట్విట్టర్‌లో ఏదోదే అనేశాడు. అయితే మన ప్లేయర్స్ కామ్‌గా ఉంటారేమోగానీ.. మన నెటిజన్లు ఊరుకోరుగా. మిచెల్‌ను లెఫ్ట్ అండ్ రైట్ వాయించేశారు. ఫిట్‌నెస్ లేక రిటైరై ఇంట్లో కూర్చున్న నువ్వు కూడా నెహ్రా గురించి చెబుతావా అంటూ చెడామడా తిట్టేశారు. నెహ్రా గణాంకాలను కూడా బయటపెట్టి మరీ జాన్సన్‌ను ఆడుకున్నారు. బీబీఎల్‌లో తాను బరిలోకి దిగుతున్నానని జాన్సన్ మొదట ట్వీట్ చేశాడు.


దీనికి న్యూజిలాండ్ బౌలర్ మెక్‌క్లెనగన్ రిైప్లె ఇచ్చాడు. 30 ఏళ్లు దాటిన బెస్ట్ లెఫ్టామ్ పేసర్ ఎవరో చూద్దామంటూ జాన్సన్ అతనికి సవాలు విసిరాడు. ఇంతలో మరో ఆస్ట్రేలియన్ మాజీ డీన్ జోన్స్ జోక్యం చేసుకొని నెహ్రానే అంటూ సెటైర్ వేశాడు.
అవును అతను రనప్‌లో మాత్రం బెస్ట్ అంటూ జాన్సన్ కూడా ట్వీట్ చేయడంతో ఓ ఇండియన్ ఫ్యాన్ జాన్సన్‌కు క్లాస్ పీకాడు. దీనిపై జాన్సన్ స్పందిస్తూ యావరేజ్ 40, ైస్ట్రెక్ రేట్ 80 వరకు ఉన్న నెహ్రానా అంటూ నవ్వాడు. ఇక మిగతా నెటిజన్లు కూడా ఎంటరై జాన్సన్‌ను తెగ తిట్టిపోశారు.
2224
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles