టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌

Sat,January 12, 2019 07:31 AM

Australia Win Toss, Opt To Bat

సిడ్నీ : ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై టెస్ట్ సిరీస్ గెల‌వాల‌నే క‌ల‌ని నిజం చేసుకున్న భార‌త్ ఇప్పుడు వ‌న్డేలోను త‌మ హ‌వా చూపించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతుంది. మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా నేడు తొలి వ‌న్డే సిడ్నీ వేదిక‌గా జ‌రుగుతుంది. టెస్ట్ సిరీస్ విజయమిచ్చిన ఆత్మవిశ్వాసంతో వన్డేల్లోనూ ఆసీస్ పనిపట్టాలన్న పట్టుదలతో కోహ్లీసేన కనిపిస్తున్నది. అయితే టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. స్టార్ స్నిన్నర్ నాథన్ లియాన్, సీనియర్ పేసర్ పీటర్ సిడిల్ చేరికతో ఆ జ‌ట్టు ఒకింత పటిష్ఠంగా ఉంది. ఇక బుమ్రాకి విశ్రాంతి నివ్వ‌డంతో సిరాజ్ ఈ సిరీస్‌లో ఆడే అవ‌కాశం ద‌క్కిన ఫైన‌ల్ లిస్ట్‌లో మాత్రం ప్లేస్ ద‌క్క‌లేదు. జ‌డేజా, దినేష్ కార్తీక్‌కి చాలా కాలం త‌ర్వాత వ‌న్డేలో ఆడే అవ‌కాశం ద‌క్కింది. మొత్తంగా భార‌త్ భారత్‌ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది.

భార‌త జ‌ట్టు : కోహ్లీ ( కెప్టెన్‌), రోహిత్ శ‌ర్మ‌, శిఖ‌ర్ ధావ‌న్‌, రాయుడు, దినేష్ కార్తీక్‌, ధోనీ, జడేజా, భువనేశ్వర్ కుమార్‌, కుల్దీప్, ఖలీల్, షమీ.

ఆస్ట్రేలియా: ఫించ్(కెప్టెన్), అలెక్స్ క్యారీ, ఖవాజ, షాన్ మార్ష్, పీటర్ హ్యాండ్స్‌కోంబ్, మార్కస్ స్టోయినిస్, మ్యాక్స్‌వెల్, పీటర్ సిడిల్, రిచర్డ్‌సన్, లియాన్, బెహెన్‌డార్ఫ్.

3118
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles