టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

Thu,June 20, 2019 02:50 PM

Australia win the toss and bat

నాటింగ్‌హామ్: ఇవాళ జరగనున్న ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జిలో ఈ మ్యాచ్ జరగనుంది. పసికూన బంగ్లాదేశ్ ప్రస్తుతం మాంచి ఫామ్‌లో ఉంది. ఇప్పటికే వెస్టిండీస్, సౌతాఫ్రికాపై గెలిచిన బంగ్లాదేశ్.. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై గెలవాలనే కసితో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా.. శ్రీలంక, పాకిస్థాన్, వెస్టిండీస్, అఫ్ఘనిస్తాన్‌పై గెలిచి టాప్‌లో దూసుకుపోతోంది.

ఆస్ట్రేలియా టీమ్‌లో నైల్, జంపా, స్టోయినిస్ జట్టులోకి రాగా.. బ్రెహెన్‌డోర్ఫ్, మార్ష్, రిచార్డ్‌సన్ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. బంగ్లాదేశ్ జట్టు నుంచి రుబెల్, సబ్బిర్ జట్టులోకి రాగా.. సైఫుద్దీన్, మొసద్దెక్ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు.

ఆస్ట్రేలియా జట్టు ఆట‌గాళ్లు: డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ఫించ్‌(కెప్టెన్‌), ఉస్మాన్‌ ఖవాజా, స్టీవ్‌స్మిత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, ఆలెక్స్‌ కారే, నాథన్‌ కౌల్టర్‌ నైల్‌, పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, ఆడం జంపా.

బంగ్లాదేశ్‌ జట్టు ఆట‌గాళ్లు: తమిమ్‌ ఇక్బాల్‌, సౌమ్య సర్కార్‌, షకిబ్‌ అల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, లిటన్‌ దాస్‌, మహ్మదుల్లా, షబ్బీర్‌ రహ్మాన్‌, మెహిది హాసన్‌, మష్రఫె మోర్తాజా(కెప్టెన్‌), రుబెల్‌ హొస్సేన్‌, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌.
1006
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles