ఆస్ట్రేలియాదే ఆధిపత్యం.. లీడ్ 175 పరుగులు.. చేతిలో 6 వికెట్లు

Sun,December 16, 2018 03:32 PM

Australia takes 175 runs lead at the end of third day in perth test

పెర్త్: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ ఆసక్తికరంగా మారింది. మూడో రోజు టీమిండియాను తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకే కట్టడి చేసిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి సేనకు మంచి టార్గెట్ ఇచ్చే దిశగా వెళ్తున్నది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 4 వికెట్లకు 132 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 43 పరుగులు కలుపుకొని మొత్తం 175 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా ఆరు వికెట్లు చేతిలో ఉన్న నేపథ్యంలో టీమిండియాకు చాలెంజింగ్ టార్గెట్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖవాజా 41, కెప్టెన్ టిమ్ పేన్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో షమి 2, బుమ్రా, ఇషాంత్ చెరొక వికెట్ తీసుకున్నారు. హారిస్ (20), షాన్ మార్ష్ (5), హ్యాండ్స్‌కాంబ్ (13), హెడ్ (19) ఔటయ్యారు.


ఓపెనర్ ఆరోన్ ఫించ్ 25 పరుగులు చేసి రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఫించ్ చేతి వేలు చిట్లిపోవడంతో అర్ధంతరంగా అతను వెళ్లిపోయాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 283 పరుగులకు ఆలౌటైంది. 3 వికెట్లకు 172 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా.. కెప్టెన్ కోహ్లి సెంచరీ సాయంతో ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ రహానే 51 పరుగుల దగ్గరే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత విహారి (20)తో కలిసి ఐదో వికెట్‌కు కోహ్లి 50 పరుగులు జోడించాడు. విహారి ఔటైన తర్వాత టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో రిషబ్ పంత్ (36) కాస్త వేగంగా పరుగులు సాధించడంతో టీమ్ 283 పరుగులు చేయగలిగింది.

1765
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles