సెంచరీ, హాఫ్ సెంచరీతో మెరిసిన వార్నర్, ఫించ్.. ఆస్ట్రేలియా స్కోర్ 307

Wed,June 12, 2019 06:40 PM

australia scored 307 for the loss of all wickets

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా అన్ని వికెట్ల నష్టానికి 49 ఓవర్లలో 307 పరుగులు చేసింది. పాకిస్థాన్‌కు 308 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.

ఆస్ట్రేలియా ఓపెనర్లలో డేవిడ్ వార్నర్ సెంచరీ, ఫించ్ హాఫ్ సెంచరీ చేసి జట్టుకు భారీ స్కోర్‌ను అందించారు. వార్నర్ 111 బంతుల్లో 107 పరుగులు చేసి ఔటయ్యాడు. 11 ఫోర్లు, ఒక్క సిక్స్ కొట్టాడు. ఫించ్ 84 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. 6 ఫోర్లు, 4 సిక్సులు కొట్టాడు. మార్ష్ 26 బంతుల్లో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. 2 ఫోర్లు కొట్టాడు.

ఇక.. పాకిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ ఆమిర్ ఐదు వికెట్లు తీయగా.. ఆఫ్రిదీ 2 వికెట్లు, రియాజ్ ఒక వికెట్ తీశాడు.

ఆది నుంచి ఆస్ట్రేలియా ఓపెనర్లు వార్నర్, ఫించ్ చక్కని భాగస్వామ్యంతో జట్టుకు భారీ స్కోర్‌ను అందించారు. అయితే.. ఫించ్, వార్నర్ పెవిలియన్ బాట పట్టాక.. ఆస్ట్రేలియా స్కోర్ ఒక్కసారిగా పడిపోయింది. పరుగుల వరద ఆగిపోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన ఆటగాళ్లలో ఎవ్వరూ జట్టుకు స్కోరును అందించలేకపోయారు. మార్ష్ మాత్రమే 23 పరుగులు చేయగలిగాడు. మాక్స్‌వెల్ 20 పరుగులు, కారె 20 పరుగులు చేశారు. స్మిత్ 10 పరుగులకే పెవిలియన్ బాట పట్టగా.. ఖవాజా 18 పరుగులు చేశాడు.

ఒకానొక దశలో 42 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు క్రీజులో నిలవలేకపోయారు. ఆస్ట్రేలియా వరుసగా వికెట్లను కోల్పోవడంతో ఆసీస్ 300 పరుగుల మార్కును చేరుకుంటుందా? లేదా? అనుకున్నారు. కానీ.. చివరకు ఆసీస్ 47వ ఓవర్‌లో 300 స్కోర్ మార్క్‌ను ఆస్ట్రేలియా చేరుకుంది. తర్వాత చివరి వికెట్ మిచెల్ స్టార్క్ 48వ ఓవర్ చివరి బంతిలో కోల్పోవడంతో 49 ఓవర్లకు ఆసీస్ 307 పరుగులు చేసింది.2605
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles