బౌల్ట్ హ్యాట్రిక్.. ఆసీస్ 243/9..

Sat,June 29, 2019 09:42 PM

Australia made 243 runs for the loss of 9 wickets in match with newzealand

లండన్: లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో ఉస్మాన్ ఖవాజా (129 బంతుల్లో 88 పరుగులు, 5 ఫోర్లు), అలెక్స్ కారే (72 బంతుల్లో 71 పరుగులు, 11 ఫోర్లు)లు రాణించారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 4 వికెట్లు తీయగా, లాకీ ఫెర్గుసన్, జేమ్స్ నీషమ్‌లు చెరో 2 వికెట్లు తీశారు. అలాగే కేన్ విలియమ్సన్‌కు 1 వికెట్ దక్కింది.

బౌల్ట్ హ్యాట్రిక్...


ఆసీస్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ హ్యాట్రిక్ తీశాడు. చివరి ఓవర్లో 3, 4, 5 బంతులకు ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఖవాజా, స్టార్క్, బెహ్రెన్‌డార్ఫ్‌లను బౌల్ట్ వరుసగా పెవిలియన్ పంపాడు. ఈ క్రమంలో బౌల్ట్ వరల్డ్ కప్‌లలో హ్యాట్రిక్ సాధించిన తొలి న్యూజిలాండ్ బౌలర్‌గా రికార్డులకెక్కాడు.

4045
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles