వరల్డ్ కప్ సెమీస్.. ఆసీస్ 223 ఆలౌట్..

Thu,July 11, 2019 06:44 PM

australia made 223 runs against england in world cup 2019 2nd semi final

లండన్: బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2వ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లు వెంట వెంటనే ఔట్ కావడంతో భారమంతా మిడిలార్డర్‌పై పడింది. ఈ క్రమంలో ఆసీస్‌ను స్టీవెన్ స్మిత్ (119 బంతుల్లో 85 పరుగులు, 6 ఫోర్లు), అలెక్స్ కేరే (70 బంతుల్లో 46 పరుగులు, 4 ఫోర్లు)లు ఆదుకున్నారు. కాగా ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్‌లు చెరో 3 వికెట్లను పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్‌కు 2, మార్క్ వుడ్‌కు 1 వికెట్ దక్కాయి.

790
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles