విజయాల ఆస్ట్రేలియా..1000వ గెలుపుతో సరికొత్త చరిత్ర

Sat,January 12, 2019 06:01 PM

Australia have become the first team in international cricket to amass 1,000 wins

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు చిరస్మరణీయ ఘనత అందుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆ జట్టు ఇప్పటి వరకు 1,000 మ్యాచ్‌ల్లో గెలుపొంది సరికొత్త రికార్డు సృష్టించింది. సిడ్నీలో శనివారం భారత్‌తో జరిగిన వన్డేలో ఘన విజయం సాధించడంతో ఆసీస్ ఈ మైలురాయి అందుకుంది. రిచర్డ్‌సన్(4/26) సంచలన ప్రదర్శనతో కంగారూలు 34 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. టెస్టు సిరీస్‌ను చేజార్చుకున్న సిడ్నీ మైదానంలోనే తిరిగి పుంజుకున్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో బోణీ కొట్టింది. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 1000వ విజయాన్ని సాధించిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. గ‌తేడాది ఆడిన 13 వ‌న్డేల్లో ఆసీస్ కేవ‌లం రెండింటిలోనే విజ‌యం సాధించింది. ఈ ఏడాది ఆరంభంలోనే ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్లో తొలి విజ‌యాన్ని సాధించి ఆత్మ‌విశ్వాసాన్నిపెంచుకుంది.

5607
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles