ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 479/4

Sun,January 7, 2018 06:47 AM

Australia first innings 479/4 in ashes series

సిడ్నీ: యాషెస్ సిరీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా ఆధిపత్యం దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఉస్మాన్ ఖవాజ (381 బంతుల్లో 171, 18 ఫోర్లు, సిక్స్) సూపర్ సెంచరీతో ఆకట్టుకోవడంతో 193/2 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్.. 479/4 స్కోరు చేసింది. స్టీవ్‌స్మిత్ (83), షాన్ మార్ష్ (98 నాటౌట్), మిచెల్ మార్ష్ (63 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. ఖవాజ ..స్మిత్‌తో కలిసి మూడో వికెట్‌కు 188 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. షాన్‌మార్ష్ జతగా నాలుగో వికెట్‌కు ఖవాజ 101 పరుగులు జోడించాడు. టెస్ట్‌ల్లో అత్యుత్తమ స్కోరు చేరువైన ఖవాజ అరంగేట్రం స్పిన్నర్ క్రేన్ బౌలింగ్‌లో స్టంప్ ఔటయ్యాడు. ఆఖర్లో మార్ష్ సోదరులు ఐదో వికెట్‌కు 104 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చేతిలో ఆరు వికెట్లు ఉన్న ఆసీస్ ప్రస్తుతం 133 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది.

942
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles