అడిలైడ్: క్రికెట్ ఫీల్డ్‌లో బంతి తగిలో లేదా మరేదైనా గాయంతో కుప్పకూలిన క్రికెటర్లను మనం చూశాం. కానీ ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో స్టార్ బౌలర్ నేథన్ కూల్టర్ నైల్ మాత్రం కళ్లు తిరిగి (వెర్టిగో) కింద పడిపోయాడు. కూల్టర్ నైల్ ఇండియా రానున్న ఆస్ట్రేలియా టీమ్‌లో సభ్యుడు కూడా కావడం విశేషం. పెర్త్ స్కార్చర్స్ తరఫున ఆడుతున్న కూల్టర్ నైల్.. అడిలైడ్ ైస్ట్రెకర్స్తో మ్యాచ్‌లో చివరి ఓవర్ ఐదో బంతి వేసిన తర్వాత కళ్లు తిరిగి పడిపోయాడు. అతడు వెర్టిగోతో బాధపడ్డాడని పెర్త్ టీమ్ ఫిజియో క్రిస్ క్వినెల్ చెప్పాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కొన్ని గంటలు అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత పంపించేశారు. ఈ మధ్య సొంతగడ్డపై జరిగిన సిరీస్‌లో టీమ్‌లో స్థానం దక్కించుకోని కూల్టర్ నైల్.. ఇండియా టూర్‌కు మాత్రం ఎంపికయ్యాడు. ఈ టూర్లో భాగంగా ఇండియాతో రెండు టీ20లు, ఐదు వన్డేలు ఆడనుంది.