ఆస్ట్రేలియా 142/0 నుంచి 202 ఆలౌట్

Tue,October 9, 2018 05:36 PM

Australia collapse for just 202 runs in first innings of first test against Pakistan

దుబాయ్: పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా కుప్పకూలింది. పాక్‌కు చెందిన యువ స్పిన్నర్, తొలి టెస్ట్ ఆడుతున్న బిలాల్ ఆసిఫ్ దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే ఆలౌటైంది. బిలాల్ తన తొలి ఇన్నింగ్స్‌లోనే 6 వికెట్లు తీసుకోవడం విశేషం. పేస్ బౌలర్ మహ్మద్ అబ్బాస్ నాలుగు వికెట్లతో రాణించాడు. పాక్ తరఫున తొలి టెస్ట్‌లోనే మూడో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన బౌలర్‌గా బిలాల్ నిలిచాడు. ఒక దశలో 142 పరుగులకు ఒక్క వికెట్ కూడా కోల్పోని ఆసీస్.. తర్వాత 60 పరుగుల తేడాలో పది వికెట్లు చేజార్చుకోవడం విశేషం. ఓపెనర్లు ఖవాజా (85), ఫించ్ (62) మాత్రమే రాణించారు. ఆ తర్వాత వచ్చిన ఒక్క బ్యాట్స్‌మన్ కూడా క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో 482 పరుగుల భారీ స్కోరు చేసిన పాకిస్థాన్‌కు 280 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే ఆస్ట్రేలియాను ఫాలోఆన్ ఆడించకుండా పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.


3752
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles