కోహ్లి మీకు కూడా నచ్చడు కదా.. మళ్లీ నోరు పారేసుకున్న పేన్!

Mon,December 17, 2018 04:06 PM

పెర్త్: ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పేన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మధ్య వివాదం ముదురుతున్నది. రెండో టెస్ట్ మూడో రోజు సాయంత్రం మొదలైన వీళ్ల మాటల యుద్ధం నాలుగో రోజు కూడా కొనసాగింది. నాలుగో రోజు ఉదయమే.. ఈ ఇద్దరూ ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లే పరిస్థితి వచ్చింది. దీంతో అంపైర్ కలగజేసుకొని సర్ది చెప్పాడు. ఆ తర్వాత టీమిండియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా మరోసారి ఆసీస్ కెప్టెన్ టిమ్ పేన్ స్లెడ్జింగ్ చేశాడు. అప్పటికే కోహ్లి ఔటై పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. ఈ సమయంలో బ్యాటింగ్‌కు సిద్ధమైన ఓపెనర్ మురళీ విజయ్‌ను పేన్ స్లెడ్జింగ్ చేయడం మైక్రోఫోన్‌లో వినిపించింది. మురళీ నాకు తెలుసు.. అతడు మీ కెప్టెన్ అయినా కూడా.. అంత కఠినంగా ఉండటం మీకు నచ్చదు కదా అని కోహ్లి గురించి పేన్ అన్నాడు. ఆ తర్వాత కాసేటికే విజయ్ కూడా లయన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయి వెనుదిరిగాడు.


3660
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles