ప్రెస్‌మీట్ మధ్యలో జర్నలిస్ట్ ఫోన్ మాట్లాడిన ఆసీస్ కెప్టెన్.. వీడియో

Fri,January 4, 2019 03:00 PM

Australia Captain Tim Paine attempts a Journalist phone call in the middle of a press meet

సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్ట్‌లో ఆస్ట్రేలియా కష్టాల్లో ఉంది. వరుసగా రెండో రోజు కూడా ఆసీస్‌కు ఫీల్డ్‌లో లక్ కలిసి రాలేదు. అయినా ఆ టీమ్ కెప్టెన్ టిమ్ పేన్ సెన్సాఫ్ హ్యూమర్ ఏమాత్రం తగ్గలేదు. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత ప్రెస్‌మీట్‌లో అతడు పాల్గొన్నాడు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు అతడు సీరియస్‌గా సమాధానాలు చెబుతుండగా.. ఓ మొబైల్ ఫోన్ మోగింది. ఇది ఎవరి ఫోన్ అంటూనే పేన్ ఆ కాల్ లిఫ్ట్ చేశాడు. టిమ్ పేన్ మాట్లాడుతున్నా.. మీకు ఎవరు కావాలి అంటూ అడిగాడు. దానికి అవతలి వ్యక్తి తన పేరు కేసీ అని, తనకు మార్టిన్ కావాలని అడిగింది. అతడు ప్రెస్‌మీట్‌లో మధ్యలో ఉన్నాడని, తర్వాత అతనితో కాల్ చేయిస్తానని పేన్ చెప్పాడు. ఒక్కసారి అతన్ని మెయిల్ చెక్ చేసుకోమని కేసీ చెప్పడంతో అలాగే అంటూ పేన్ ఫోన్ పెట్టేశాడు. ఎవరో జర్నలిస్ట్‌కు వచ్చిన ఫోన్ కాల్‌ను పేన్ మాట్లాడటం చూసి అక్కడున్న మిగతా జర్నలిస్టులంతా నవ్వుకున్నారు.


2502
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles