టీమిండియాతో తలపడే ఆస్ట్రేలియా టీ20 టీమ్ ఇదే

Thu,November 8, 2018 03:14 PM

Australia announce their T20 team against India

మెల్‌బోర్న్: టీమిండియాతో సొంతగడ్డపై జరగబోయే టీ20 సిరీస్‌కు టీమ్‌ను ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. స్టార్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్‌తోపాటు స్పిన్నర్ నేథన్ లయన్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌లకు ఈ టీమ్‌లో స్థానం దక్కలేదు. వీళ్లందరూ షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో ఆడి ఇండియా, శ్రీలంకలతో జరగబోయే టెస్ట్ సిరీస్‌లకు సిద్ధమవుతారని కోచ్ జస్టిన్ లాంగర్ చెప్పాడు. వీళ్ల స్థానంలో మార్కస్ స్టాయినిస్, జేసన్ బెహ్రెండార్ఫ్‌లకు చోటు కల్పించారు. వరల్డ్‌కప్‌కు ముందు ఆస్ట్రేలియా సొంతగడ్డపై కొన్ని కీలకమైన సిరీస్‌లు ఆడబోతున్నది. దీంతో బెస్ట్ టీ20 టీమ్‌ను ఎంపిక చేయడంతోపాటు కీలకమైన ఆటగాళ్లను ఆ సిరీస్‌లకు సిద్ధం చేసే ఉద్దేశంతో ఉన్నామని లాంగర్ తెలిపాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా టీమ్ అత్యంత దయనీయ స్థితిలో ఉంది. చివరి 19 వన్డేల్లో 17 మ్యాచుల్లో ఓడింది. ఇక తాజాగా పాకిస్థాన్ చేతిలో 0-3తో టీ20 సిరీస్‌ను కూడా ఓడిపోయింది.

ఆస్ట్రేలియా టీమ్


ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అలెక్స్ కేరీ, ఆష్టన్ అగర్, జేసన్ బెహ్రండార్ఫ్, నేథన్ కౌల్టర్ నైల్, క్రిస్ లిన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, బెన్ మెక్‌డెర్మాట్, డార్సీ షార్ట్, బిల్లీ స్టాన్‌లేక్, మార్కస్ స్టాయినిస్, ఆండ్రూ టై, ఆడమ్ జంపా

2329
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles